- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వ‌రుస పెట్టి క్రేజీ లైన‌ప్ లో సినిమా లు తెర‌కెక్కుతున్నాయి. భారీ గ్యాప్ తీసుకున్న ప్ర‌భాస్ ఆరు నెల‌ల వ్య‌వ‌ధి లోనే స‌లార్ - క‌ల్కి లాంటి రెండు పాన్ ఇండియా సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్‌ లైన‌స్ అయితే మామూలుగా లేదు. వ‌రుస‌గా స‌లార్ 2 - క‌ల్కి 2 - రాజాసాబ్ - స్పిరిట్ ఇలా అన్నీ క్రేజీ ప్రాజెక్టు లే ప్ర‌భాస్ చేతిలో ఉన్నాయి.


ఇక యువ ద‌ర్శ‌కుడు మారుతి అలాగే హను రాఘవపూడి కాంబినేషన్ లో భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు మాత్ర‌మే కాకుండా ప్ర‌భాస్ చేసే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేసిన మాస్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందా ? అని ఇండియ‌న్ సినీ అభిమానులు ఎప్పుడు నుంచో వెయిట్‌ చూస్తున్నారు.


అలాగే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం కూడా సోష‌ల్ మీడియా లో ఎప్ప‌టిక‌ప్పుడు అడుగుతున్నారు. అయితే ఎట్టకేలకి ఇందుకు సమయం ఫిక్స్ అయ్యినట్టు స‌మాచారం. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ స్పిరిట్ సినిమా ను ఈ ఏడాది ఉగాది కానుకగా ముహూర్త కార్యక్రమాలతో మొదలు పెట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అంటున్నారు. సో రెబల్ ఫ్యాన్స్ కి అప్పటి నుంచి అప్‌డేట్స్‌ ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో కాదు.. పాన్ ఆసియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. చైనీస్, జాపనీస్, కొరియన్ భాషల్లో కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: