మహానటి కీర్తి సురేష్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆగ్ర హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. మహానటి సినిమాలో తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహమైనప్పటికీ కీర్తి సురేష్ గ్లామర్ డోస్ ను ఏమాత్రం తగ్గించడం లేదు. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కాగా, వివాహం అయినప్పటికీ ఈ బ్యూటీ వరుసగా సినిమాలలో నటిస్తోంది. తెలుగు, హిందీలో సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా నటిస్తోంది.


కాగా, రీసెంట్ గా కీర్తి సురేష్ అక్క వెబ్ సిరీస్ లో తన గ్లామర్ డోస్ తో రెచ్చిపోయి మరీ నటించింది. ఈ తరుణంలోనే ఈ సినిమా ఓటిటీలోకి వచ్చింది. కీర్తి సురేష్ ఇదివరకు ఎప్పుడూ నటించని విధంగా పవర్ఫుల్ పాత్రలో అక్క సిరీస్ లో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ క్రమంలో మహానటి నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ తో ఎంట్రీ ఇచ్చింది.


ఇప్పటివరకు కీర్తి సురేష్ కేవలం క్యూట్ గా మాత్రమే కనిపించి అక్క వెబ్ సిరీస్ లో మాత్రం పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ టీజర్ లో కీర్తి సురేష్ మగాళ్ళ మధ్య సివంగిలా కనిపిస్తున్నారు. పెళ్లి అయిన అనంతరం చాలామంది కీర్తి సురేష్ సినిమాలకు పూర్తిగా దూరమవుతుందని కామెంట్ చేశారు. అలాంటి వారికి ఈ టీజర్ తో కీర్తి సురేష్ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: