తెలుగు సినిమా పరిశ్రమలో దిల్ రాజ్ పైనే కాకుండా చాలామంది నిర్మాతల పైన గత కొద్దిరోజుల క్రితం ఐటి శాఖ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా అందరి సంగతి కాదు కానీ దిల్ రాజ్ సంగతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా దిల్ రాజ్ ఇల్లు, కార్యాలయంతో పాటుగా ఆయన సోదరుడు, కుమారుడు, కూతురు ఇల్లు కార్యక్రమాలను సైతం ఐటి అధికారులు సోదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా దిల్ రాజు కార్యాలయంలో పెద్ద మొత్తంలో కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి.


ఆ తర్వాత దిల్ రాజ్ ను విచారించిన అధికారులు ఆయనను వదిలేసారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి ఐటీ అధికారులు తన దగ్గర తక్కువ డబ్బును చూసి ఆశ్చర్యపోయారని కూడా తెలియజేశారు. అయితే ఈ క్రమంలోనే మంగళవారం రోజున మళ్లీ హాజరు కమ్మని చెప్పడంతో దిల్ రాజు పెద్ద మొత్తంలో పత్రాలను చేత పట్టుకొని మరి ఐటీ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. అయితే దిల్ రాజ్ వెళ్లిన తీరును చూస్తూ ఉంటే ఈసారి కూడా విచారణ ముగించేలా కనిపించడం లేదట. దీంతో దిల్ రాజుకు ఈ ఐటీ అధికారుల సమస్య ఇప్పట్లో వదిలేలా కూడా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.


ఐటీ సోదరుల విషయంలో దిల్ రాజ్ అప్పుడు లైట్గా తీసుకున్నట్లు తెలియజేశారు . అందరిమాదిరే  తనపైన రైడ్ జరిగిందని ఇందులో ఆశ్చర్య పోవాల్సినది ఏమిలేదు అన్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా దిల్ రాజ్ భార్యను వెంటపెట్టుకొని మరి అధికారులు బ్యాంకుకు వెళ్లి అక్కడ లాకర్లను సైతం పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు అంతేకాకుండా ఒక చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించడంతో దిల్ రాజ్ పేరు ఎక్కువగా వినిపించింది. దీంతో దిల్ రాజ్ పన్ను చెల్లింపులు చెల్లలేదని భావన ఐటీ అధికారులకు కలగడంతో ఈ సోదాలు నిర్వహించినట్లుగా వార్తలువినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: