ఇపుడు ఈ కధంతా ఎందుకు? మాకు తెలుసు అని అనుకుంటున్నారా? ఈ మొత్తం కాశాలో అక్షయ పాత్రధారి అందరికీ గుర్తుండే ఉంటుంది. గాజుకళ్ళతో చాలా చలాకీగా క్యూట్ గా ఉన్న ఆ చిన్నపిల్ల అప్పటి ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసింది. అయితే ఇపుడు ఆ పిల్లి కళ్ళ పాప ఎలావుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ చైల్డ్ ఆర్టిస్టు ఇపుడు బ్యూటీ అయిపోయింది. అవును ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అక్షయ పాత్రలో నటించిన చిన్నారి అని గుర్తు పట్టారా? తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆ ఫోటోలు చూసిన జనాలు అవాక్కవుతున్నారు.
ఎందుకంటే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో ఆమె ఆకట్టుకుంటోందీ మరి. ముంబాయిలో పుట్టి పెరిగిన ఈమె ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. డాడీ సినిమా తర్వాత పూర్తిగా చదువుపై దృష్టిసారించడంతోనే ఈ చిన్నారి 'అనుష్క' సినిమాలకు దూరమైనట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే మల్హోత్రా తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేయడం విశేషం. సుమారు 22 ఏళ్ల తర్వాత అనుష్క ఫొటోలు బయటకు రావడంతో చాలా మంది గుర్తుపట్టడం లేదు.