ఇందులో బాలకృష్ణ ఎప్పటిలానే తనదైన నటనతో అభిమానులను అలరించాడు. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటించారు. ఈ సినిమా అనంతరం బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ-2 సినిమా షూటింగ్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉండగా....ఇటీవలే బాలయ్య బాబుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబు చేస్తున్న సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు.
బాలయ్య బాబు ఈ అవార్డు అనుకోవడంతో తెలుగు సినీ నటులు, రాజకీయ విశ్లేషకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా... బాలయ్య బాబుకు హీరోయిన్ సిమ్రాన్ అంటే విపరీతంగా ఇష్టమట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిమ్రాన్ వయసు 48 ఏళ్లు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది.
దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కేవలం తల్లి, అక్క, అత్త, అమ్మ వంటి పాత్రలను మాత్రమే పోషిస్తుంది. కానీ బాలయ్య బాబు మాత్రం అప్పటికీ ఇప్పటికీ తనదైన నటనతో హీరోగా చలామణి అవుతున్నారు. కాగా, బాలకృష్ణకు సిమ్రాన్ అంటే ఎంతగానో ఇష్టమట. తన నటన, అందం ఎంతగానో నచ్చుతాయట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.