అయితే అంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నాళ్ళ నుండో వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అనే రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ అయితే బాగా రన్ అవుతోంది. దీనినే నిజం చేస్తూ... ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు మధ్య మనస్పర్ధలు వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. విషయంలోకి వెళితే... బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెబుతూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. కానీ బాలయ్య దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కొసమెరుపు. అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికి బాలయ్య బాబు మాత్రం వాళ్లతో మాట్లాడే ప్రసక్తే లేదు అన్నట్టుగా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
అయితే, బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విబేధాలు రావడానికి కారణం ఏమిటి అని వెతుకుతున్నపుడు తాజా రాజకీయాలే కారణంగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబు, చంద్రబాబుతో అస్సలు కలవడం లేదు. టిడిపి పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి మద్దతు కూడా తెలపలేదు. దాంతోనే ఆయనను పక్కన పెట్టినట్టు భోగట్టా. అలాగే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చెల్లెలు అయిన భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని అన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా ఎన్టీఆర్ వాళ్ల మీద ఫైర్ అవుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కి స్కిల్ డెవలప్ మెంట్ ముందు జైల్లో ఉన్నప్పుడు అతన్ని ఎంతోమంది పరామర్శించడానికి వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో బాలయ్య బాబుకి వాళ్ళ మీద ద్వేషం మరింత పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇవే కారణాలుగా చేసుకొని బాలయ్య, ఎన్టీఆర్ మీద పగ పెంచుకున్నాడని వినికిడి.