గీతా ఆర్ట్స్ సంస్థ కు టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ ను అన్నీ తానై నడిపిస్తున్నాడు యంగ్ ప్రొడ్యుసర్ బన్నీవాస్. పెట్టుబడి పెట్టేది అల్లు అరవింద్ కావొచ్చు. కానీ సెట్‌లో ఉండి .. సినిమా నిర్మాణం వరకు అన్నీ దగ్గరుండి చూసుకొనేది మాత్రం బన్నీ వాసే .. ఇంకా చెప్పాలి అంటే బన్నీ వాస్ ను అరవింద్ అంతలా నమ్మేశారు. పైగా ఇద్దరిది పాలకొల్లు కావడం తో పాటు తమ సంస్థ పట్ల బన్నీ వాస్ అంకిత భావంతో ఉండడం కూడా అరవింద్ నమ్మకానికి మరో కారణం గా కనిపిస్తుంది.
ఇక జీఏ, జీఏ 2 నుంచి వస్తున్న సినిమాలకు ఆయన అధికారిక నిర్మాత అని చెప్పాలి.. తాజాగా నాగచైతన్య - సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ తండేల్ ’ సినిమాకూ నిర్మాతగా బన్నీ వాస్ పేరే పడింది. అయితే బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారని.. ఆయన ఇంకో బ్యానర్ పెట్టుకుంటున్నారంసొంతంగా బ్యానర్ పెడుతున్నారన్న రకరకాల పుకార్లు .. రకరకాల వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటిని బన్నీ వాస్ ఖండించారు.
గీతా నుంచి బయటకు రావడం లేదని.. అయితే తనకు నచ్చిన కథలను .. తాను నిర్మాతగా సొంత డబ్బు లతో సినిమాలు తీసుకుంటానని.. తనకు నచ్చిన కథల్లో కొన్ని అరవింద్ గారికి నచ్చవు .. అలాంటి కథలతో తాను సొంతంగా సినిమాలు తీసుకుంటానని చెప్పారు. ఇదే విషయం అరవింద్ గారికి కూడా చెప్పగా ఆయన కూడా ఓకే చెప్పారని బన్నీ వాస్ తెలిపారు. ఇదిలా ఉంటే బన్నీ వాస్ ప్లానింగ్ చూస్తుంటే తండేల్ సినిమా ను ఓ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ చేసే వరకు నిద్రపోయేలా లేరు.