టాలీవుడ్ లో అక్కినేని హీరో .. యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి జోడీగా నటించిన సినిమా తండేల్. ఈ సినిమా మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్ల లోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సినిమాను థియేటర్ల లోకి మేకర్స్ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమోషన్లు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. నిఖిల్ హీరోగా కార్తీకేయ 2 లాంటి బంపర్ హిట్ కొట్టిన చందూ మొండేటి తండేల్ సినిమా కు దర్శకత్వం వహించటంతో నార్త్ లో కలిసి వస్తుందని మేకర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే పాన్ ఇండియా అప్పీ ల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో తండేల్ సినిమా కు తొలి రోజు భారీ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇటు సంక్రాంతి సినిమా హడావిడి తగ్గి పోవడంతో ఎక్కువ థియేటర్ల లో సోలో రిలీజ్ ఉండడంతో ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయనే అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో అడ్వాన్స్ బుక్కింగ్ ల పరిస్దితి చూస్తే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్లో గా ఉన్నాయంటున్నారు.
మరీ ఎక్స్ ట్రార్డినరీగా అయితే బుకింగ్స్ లేవని తెలుస్తోంది. ఇందకు నాగచైతన్య గత సినిమా రిజల్ట్స్ కూడా ఓ కారణం కావచ్చు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక హిట్ టాక్ వస్తే అప్పుడు బుకింగ్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు ఆశతో అయితే ఉన్నాయి. ఇక ట్రైలర్ కూడా అనుకున్నట్టుగా కనెక్ట్ కాకపోవడం ఓ మైనస్ అంటున్నారు. నాగచైతన్య కు మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా తక్కువ .. సాయి పల్లవి కోసం అయినా జనాలు థియేటర్లకు క్యూ కడతారన్న ఆశలు కూడా ఉన్నాయి.