ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్.. కనుమూరు రఘురామ కృష్ణంరాజు పంతం పడితే ఎలా ఉంటుందో .. ఆయన రివేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా అందరికీ తెలిసిందే. అది వైసీపీ లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అయినా .. ఆ తర్వాత గతేడాది టీడీపీ లోకి వచ్చే ముందు .. ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో అయినా ఆయన అనుకున్నది సాధించే దాకా నిద్ర పోరు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలీ ఉంటుంది. వాటిని సాధించుకునే విషయం లో ఆయన ఎంత వరకు అయినా వెళతారు .. ఎక్కడైనా కూడా వెనక్కు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తారు.
అయితే రఘురామ కు చాలా కోరికలు తీరినా రెండు కోరికలు మాత్రం మిగిలి పోయాయట. ఇప్పుడు వాటిని సాధించుకునే విషయంలో ఆయన ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆ రెండు కోరికలు ఏమిటో కాదు .. 1) తనను అక్రమంగా అరెస్టు చేసినట్టు ఆయన భావిస్తోన్న ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ చీఫ్.. సునీల్ కుమార్ పై స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవడం .. 2 ) రెండోది వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను సభను నుంచి సస్పెండ్ చేయడం.. లేదా సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయడం అట. ఈ రెండు అంశాల ను కూడా రఘురామ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు ఆయన మాటలే చెపుతున్నాయి.
ఇక సునీల్ కుమార్‌పై తాను ఫిర్యాదు చేసినా.. ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన నేరుగా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఎవరు ? ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇక జగన్ అసెంబ్లీ మొఖం చూసేందుకు ఇష్ట పడడం లేదు. వరుసగా అసెంబ్లీని 60 రోజుల పాటు నిర్వహించి.. జగన్ కనుక వరుసగా 4 రోజులు కూడా రాకపోతే.. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆయనను సస్పెండ్ చేయవచ్చన్నది రఘురామ ఐడియా. మరి ఆయన రెండు కోరికలు ఎంత వరకు తీరుతాయో ? చూడాలి.