చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమాలో నాగ చైతన్య హీరో కాగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం కొసమెరుపు. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ప్లస్ కావడం వల్ల సినిమాకు విపరీతమైన పాజిటివ్ బజ్ వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ట్రైలర్ కూడా బావుండడంతో బజ్ మరింత ఎక్కువైంది. అవును... తండేల్ సినిమాకు వస్తున్న ఈ వైబ్ చూస్తుంటే నాగ చైతన్య గురి తప్పదని అర్ధం అవుతోంది. రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అక్కినేని లెక్కలు మారబోతున్నాయని చెప్పించారు. సో తండేల్ తో అక్కినేని హీరోలు కూడా 100 కోట్లు ఆ పైన కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక పోటీగా మరో సినిమా గోల లేదు కాబట్టి తప్పకుండా తండేల్ సినిమా సత్తా చాటుతుందని అంతా అనుకుంటున్నారు.
అవును... రాజులమ్మ జాతర సాక్షిగా సినిమా రికార్డులు కొట్టే ఛాన్స్ లేకపోలేదని భోగట్టా. టాలీవుడ్లో ఒక పెద్ద ఫ్యామిలీ అయినటువంటి అక్కినేని కుటుంబం నుంచి ప్రయోగాత్మక సినిమాలు రావడం తక్కువ. అలనాడు అక్కినేని గారు తప్పితే తరువాత తరాలు పెద్దగా ప్రయోగాలు చేయలేదనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో నాగార్జున రెండు మూడు సినిమాలు చేయగా అందులో 'అన్నమయ్య' సినిమా ఆయనకి ప్రత్యేకమైన కీర్తిని తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటి తరం గురించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణ సినిమాలే అదనప్పుడు ఇక విశ్వ ప్రయత్నాలు చేసి ఉపయోగమేముంది? అయితే అక్కినేని ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఇపుడు ఆయన వారసుడు తండేల్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఏ మేర ఆడుతుందో చూడాలి. ఒకవేళ అటుఇటు అయితే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున ఒక్కడే మొనగాడుగా మిగలనున్నాడు.