తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు, ఈ కుటుంబం నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో సక్సెస్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు, సినీ పరిశ్రమ నందమూరి కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తారు.

 నందమూరి వారసత్వాన్ని బాలకృష్ణ ముందుకు తీసుకెళుతున్నారు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్లోబల్ రేంజ్ లో నందమూరి ఫ్యామిలీకి పేరు తెస్తున్నారు  అయితే, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య కుటుంబ కలహాల కారణంగా తీవ్రమైన విభేదాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు దూరంగా ఉంటున్నారని టాక్. అసలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది చాలా మందిలో ఆసక్తికరంగా మారింది.

వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయని, అవి కాస్తా పెద్ద గొడవలుగా మారాయని సమాచారం. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, వాళ్లు ఇప్పుడు ఒకరినొకరు ఎదురుపడితే కనీసం పలకరించుకోవడం కూడా లేదట. ఇటీవల బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినప్పుడు, తారక్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. కానీ బాలకృష్ణ మాత్రం దీనికి స్పందించలేదు. తారక్ మాట్లాడాలని ప్రయత్నించినా, బాలకృష్ణ మాత్రం పట్టనట్టుగా మొండిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం నందమూరి కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు కళ్యాణ్ రామ్, తారక్ ఉంటే, మరోవైపు మిగిలిన నందమూరి కుటుంబం మొత్తం ఉందని అంటున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య గొడవలకు ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా బాలకృష్ణను సరిగా కలవకపోవడమే అని చెబుతున్నారు. అంతేకాకుండా, జూ.ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు ఇవ్వనందువల్లే ఆయన్ని దూరం పెట్టారని కూడా అంటున్నారు.

మరికొన్ని కారణాలూ. అసెంబ్లీలో వల్లభనేని వంశీ, కోడాలి నాని బాలకృష్ణ సోదరి భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి అసెంబ్లీ సమావేశాలకు సాక్షిగా హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలను ఖండించలేదు, వారిని విమర్శించలేదు. దీంతో బాలకృష్ణ మరింత ఆగ్రహం చెందినట్లు సమాచారం. ఇంకా, చంద్రబాబు ఎన్నికల ముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నప్పుడు చాలా మంది ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. ఇది బాలకృష్ణకు మరింత కోపం తెప్పించిందని, ఎన్టీఆర్‌పై ఆయన ద్వేషం మరింత పెరిగిందని అంటున్నారు.

ఈ సంఘటనల తర్వాత బాలకృష్ణ కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఎన్టీఆర్‌తో మాట్లాడే ఉద్దేశం లేనట్లుగా ఉంటున్నారని సమాచారం. భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోలు కలుస్తారా లేదా అనేది వేచి చూడాలి. కాలం ఈ విభేదాలను తగ్గిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: