ఆయనని రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు . ఆయన పేరుని కావాలని ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు . కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా సైలెంట్ గా అలాంటి వాటిని తిప్పికొడుతూ వస్తారు. అయితే ఒకానొక సందర్భంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవికి బాగా కోపం వచ్చిందట. ఆ కారణంగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ ని గట్టిగా అరిచేస్తూ తిట్టేసారట. దానికి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . రామ్ చరణ్ అంటే మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టం . అయితే పిల్లలను ఎంత ప్రేమగా పెంచిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం క్రమశిక్షణ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు
కాగా ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారట . అంతేకాదు అప్పుడే కొన్ని చెడు మాటలు కూడా నేర్చుకున్నారట . ఒకానొక మూమెంట్లో ఒక అపార్ట్మెంట్ వద్ద ఎవరో వాచ్ మ్యాన్ బూతు పదాలు మాట్లాడుతూ ఉంటే.. అది విని ఇంటికి వచ్చి అలాగే మాట్లాడారట . దీంతో అక్కడే ఉన్న నాగబాబు అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫైర్ అయిపోయారట. మెగాస్టార్ చిరంజీవి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక "ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తోలు తీస్తా నా కొడకా" అంటూ ఘాటుగానే చెంప పగిలిపోయే రేంజ్ లో కోప్పడ్డారట. రామ్ చరణ్ లైఫ్ లో ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేడట . ఈ విషయాన్ని స్వయాన రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు..!