మరీ ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే విధంగా ఉండడం అందుకు బిగ్ ప్లస్ అని చెప్పాలి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఇప్పుడు ఇక్కడే పెద్ద ట్విస్ట్ కూడా వచ్చింది . ఈ సినిమాలో చాలామంది హీరోస్ ని యాడ్ చేయబోతున్నాడట జక్కన్న .
ఆయన డైరెక్టర్ చేసిన ఇదివరకు హీరోలను కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారట . సినిమాకి గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకోవడమే కాకుండా మరో ఆస్కార్ ఇండియాకి తీసుకురాబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఇండస్ట్రీలో రాజమౌళిని మడత పెట్టేయాలి ..ఆయన పేరు మరిచిపోవాలి అంటే అలాంటి గట్స్ తో సినిమాను తెరకెక్కించే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటూ చెప్పుకొస్తున్నారు. సందీప్ రెడ్డివంగా సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే . రాజమౌళి సినిమాలు ఎంత పద్ధతిగా ఉంటాయో సందీప్ రెడ్డివంగా సినిమాలు అంత బోల్డ్ గా ఉంటాయి. కచ్చితంగా రాజమౌళిని మడత పెట్టేసి అంత సత్తా ఉన్నది మాత్రం సందీప్ రెడ్డి వంగాకి అంటున్నారు జనాలు. చూద్దాం ఫ్యూచర్లో రాజమౌళికి ఎలాంటి కాంపిటీషన్ ఇస్తాడో ఈ సందీప్ రెడ్డి వంగా..!?