అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా తండేల్ గురించి జనాలకు బాగా తెలుసు. ఎందుకంటే సంక్రాతి సీజన్ తరువాత రిలీజ్ కాబోతున్న భారీ సినిమా ఇదే మరి. అందుకే ఈ సినిమాపై సర్వత్రా మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ జనాలను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతుండడంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే వైజాగ్, హైదరాబాద్, ముంబై, చెన్నైలో తండేల్ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించింది చిత్ర యూనిట్.

ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు అయినటువంటి చందు మొండేటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులు చందు మొండేటి మాటలకూ ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే చందూ తన హీరో నాగ చైతన్యను ఆకాశానికెత్తేయడమే దానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకోసం నాగ చైతన్య బాగా కష్టపడ్డాడని, ఇంతలా ఓ సినిమాకోసం కష్టపడి ప్రాణాలను పెట్టే హీరోని తాను మునుపెన్నడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. దాంతో ఈ సినిమా నాగ చైతన్య కోసమైనా ఆడుతుందని, ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రలో ఒదిగిపోయాడని, యాక్టింగ్ ఇరగదీసేసాడని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే హీరోయిన్ సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారని కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో వస్తున్న వార్తలపై స్పందించారు డైరెక్టర్. ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆమె రాకపోవడంపై స్పందిస్తూ సాయి పల్లవి హెల్త్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని, అయినా సరే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీంతో ఆమె మరింత నిరసించి ఇక్కడికి రాలేకపోయారని చెబుతూ వాపోయాడు. వైద్యులు ఆమెకు కనీసం 2 రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించడంతోనే ఆమె ముంబై వేదికగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు అంటూ చెప్పుకొచ్చారు చందు మొండేటి.

మరింత సమాచారం తెలుసుకోండి: