సిని సెలబ్రిటీల వీడియోలో ఉన్న ఓ హార్డ్ డిస్క్ పోలీసులకు చిక్కింది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో ఎవరి వీడియోలు ఉన్నాయి అని ఆరా తీయడం కూడా మొదలైంది .. ఇది ఒక కోణం .. అసలు ఈ హార్డ్ డిస్క్ వార్త నిన్నటికి నిన్న బయటకు రావడం కొన్ని రసవత్తర వీడియోలు కొన్ని ఛానల్ కు లిక్‌ కావటం మీద ఎన్నో డిస్కషన్లు ఉన్నాయి అనేది మరో కారణం. రాష్ట్రంలో రాజకీయ వేడి చాలా ఎక్కువగా ఉంది .. కులాల సర్వే తప్పులు తడ‌కగా ఉందంటూ ఆరోపణలు , కులాల కుమ్ములాటలు ఇలా ఒకటి కాదు నానా రచ్చ జరుగుతుంది ..


ఇప్పుడు ఈ మొత్తం రాజకీయ వార్తల్లో హైలెట్ కాకుండా చేయడానికి ఈ హార్డ్ డిస్క్ వార్త బయటకు వచ్చిందని మరో కామెంట్లు కూడా ఉన్నాయి .. ఈ మెర‌కు కొందరు ఆరోపణలు కూడా చేస్తున్నారు . ప్రస్తుతం మీడియాకు వార్త‌లు కావాలి అందులోనూ సంచలన విష‌య‌లు ఉండాలి .. రాజకీయ వివాదాలు కుల కుమ్మలాటలు కన్నా సినీ సెలబ్రిటీలకు వీడియోలు బయటికి రావటం అనేది కొంత క్రేజీ వార్త .. నిన్నంతా డిజిటల్ టీవీ ఛానళ్లు అన్నీ దిని మీద ఫోకస్ పెట్టారు ..


పావలా పిట్టకు రూపాయి మసాలా అద్దినట్టు వీలైనంత మసాలా దట్టించి వార్తా కథనాలను ప్రేక్షకుల ముందు వడ్డించి వదిలారు. అసలు నిజం తెలుస్తుంది ఏమిటంటే .. జనాలు గుర్తుపట్టే అంతా కాస్త చెప్పుకోదగ్గ సినిమాలో నటించిన హీరోయిన్ల వీడియోలు ఏవి ఈ డిస్క్‌ లో లేవని.. చిన్నచిన్న రోల్స్ కోసం అడబాదటప అవకాశల‌ కోసం వ‌చ్చిన‌  అమ్మాయిలు  ఒకరిద్దరి వీడియోలో మాత్రమే అందులో ఉన్నాయని అసలు విషయం తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఆ వార్త చెపితే ఆసక్తి ఉండదు కదా అందుకే అదిగో పులి ఇదిగో శవం అనే అంతగా తెలంగాణ మీడియాలో ఈ హడావుడి ఊపుందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: