తెలుగు చిత్ర పరిశ్రమల గత కొంత కాలంగా పాన్ ఇండియా సినిమాల హవా గట్టి గా కొనసాగుతుంది .. భారీ బడ్జెట్ సినిమాలు , విభిన్నమైన కథల తో సౌత్ ఇండస్ట్రీ దేశవ్యాప్తం గా గుర్తింపు తెచ్చుకున్న వేళా తమిళ్ దర్శకులు టాలీవుడ్ హీరోల తో సినిమాలు చేసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. కానీ ఈ ప్రయోగాలు మొదటి నుంచి ఆశంచిన ఫలితాలు అందుకోలేకపోతున్నాయి .. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ గేమ్‌చేంజర్ సినిమా కూడా ఈ జాబితాలోనే చేరింది . శంకర్ దర్శకత్వం లో భారీ అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది . ఒక రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మన తెలుగు హీరోలు తమిళ దర్శకుల తో చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి .
ఇదే క్రమంలో గతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన పంజా మూవీ కూడా ప్రేక్షకులకు గట్టి షాక్ ఇచ్చింది .. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది .. అలాగే ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ లుక్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది .. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా బాగా ప్రేక్షకులను మెప్పించాయి .. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించిని డిజాస్టర్ గా మిగిలిపోయింది .. పవన్ కల్యాణ్‌ని డిఫరెంట్‌గా చూపించాలనుకొన్న అతని ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలించలేదు . పంజా తరవాత తెలుగులో విష్ణు పేరు తలచుకొన్నవాళ్లే లేరు . అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత రాడ్ డిజాస్టర్ లో ఈ సినిమా కూడా నిలిచిపోయింది .