బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన కత్తి దాడి కి సంబంధించి ఇప్పటికే ఎన్నో  వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ వ్యక్తిని పట్టుకొని అతడు నిందితుడు కాదని తెలిసి అతన్ని వదిలేశారు. ప్రస్తుతం వేరే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కత్తి దాడి విషయంలో సైఫ్ అలీఖాన్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది బాలీవుడ్ జనాలు ఈ కత్తి దాడి గురించి వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు. సైఫ్ ఇంట్లో పని చేసే పనిమనిషి ప్రియుడే సైఫ్ పై అటాక్ చేశారని అంటున్నారు.అందుకే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని ఇలా ఎన్నో రూమర్లు తెరమీద వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లన్ని వినిపిస్తున్న వేళ తాజాగా బాలీవుడ్ నిర్మాత  షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడికి అల్లు అర్జున్ 100 కోట్లకు మధ్య రిలేషన్ కలిపాడు. 

ఇక అసలు విషయం ఏమిటంటే.. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో చాలామంది నెటిజన్లు అంత పెద్ద హీరో అయ్యుండి సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు..కనీసం డ్రైవర్ లేడా.. అలాగే కార్లు కూడా అందుబాటులో ఉండవా.. అంత పెద్ద రాజవంశీయులకు చెందిన కుటుంబం నుండి వచ్చిన సైఫ్ అలీఖాన్ అలాగే బాలుడు హీరో మరీ ఇంత నిర్లక్ష్యం చేస్తారా అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు..నిర్మాత.. దర్శకుడు ఆకాష్ దీప్ సబీర్ స్పందించారు.. కరీనా కపూర్ నాకు చిన్నప్పటినుండి తెలుసు.. సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడి జరిగిన సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి నేను అండగా నిలిచాను.

కానీ వాళ్లు ఇంటిదగ్గర సెక్యూరిటీని ఎందుకు పెట్టుకోలేదు. డ్రైవర్ ను ఎందుకు నియమించుకోలేదు అంటే మాత్రం నా దగ్గర సమాధానాలు లేవు.పుష్ప లో నటించిన అల్లు అర్జున్ కి 100 కోట్లు ఇచ్చినట్టు కరీనాకపూర్ కి కూడా 100 కోట్లు ఇస్తే ఇంటిదగ్గర సెక్యూరిటీని పెట్టుకుంటుంది కావచ్చు.. కరీనాకపూర్ 21 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా కూడా ఇప్పటివరకు ఇంటిదగ్గర ఫుల్ టైమ్ సెక్యూరిటీని పెట్టుకోలేకపోయింది అంటూ మాట్లాడారు.ప్రస్తుతం ఈయన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: