ప్రజెంట్ టాలీవుడ్ లో అన్ని అగ్ర నిర్మాణ సంస్థలు పాన్ ఇండియా సినిమాలనే నిర్మిస్తున్నాయి.  అలాంటి నిర్మాణ సంస్థలు ఒక సమయంలో ఒక పాన్ ఇండియా సినిమాని నిర్మించడానికి  నిర్మాతలు ఎంతో కష్టపడుతున్న ఈ రోజుల్లో ఏమాత్రం ఎలాంటి ఆలస్యం జరిగిన లేక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా బడ్జెట్ అంతకంతకు పెరుగుపై నిర్మ‌త‌లకు కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది .. రీసెంట్ గానే గేమ్ చేంజర్ రూపంలో దిల్ రాజుకు ఇది అనుభవం అయింది. అలాంటిది ఒకే సమయంలో రెండు టాలీవుడ్ ప్రెస్టేజ్ సినిమాలను తెరకెక్కిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం .. కానీ మైత్రి మూవీ వారు దాన్ని తట్టుకొని మరి రెండు పెద్ద సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు .. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెర్కక్కుతున్న పౌజి షూటింగ్ కీలక దసుకు చేరుకుంది.
 

రేపటి నుంచి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది .. స్వాతంత్రం రాకు ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ల రూపంలో సృష్టించి ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు .. ఇంతకుముందు కొన్ని భాగాలను కూడా ఇక్కడే షూట్ చేశారు . ఇక ఈ సినిమాలో సైనికుడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు . అయితే ఆయన పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయని .  అలాగే ఎమోషనల్ ప్రేమ కథతో పాటు దేశభక్తి అంశాలు కూడా ఉండబోతున్నాయట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో వచ్చే సినిమాని కూడా ఇదే నెలలో షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాటులు జరుగుతున్నాయి. మొదట ఎన్టీఆర్ లేని ఎపిసోడ్లో షూట్ చేస్తారని టాక్ .. కేజిఎఫ్ , స‌లార్‌న్ని మించి సరికొత్త ప్రపంచాన్ని నీల్‌ ఈ సినిమాలో సృష్టించబోతున్నాడని టాక్‌.

 

అయితే ఈ సినిమాల రిలీజ్ తేదీలు ఇంకా కన్ఫామ్ కాకపోయినా ఈ రెండు సినిమాలు ఈ ఏడాది లోపే వచ్చేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు .. అయితే ఇది ఎంతవరకు నితం అవుతుందో అనేది కచ్చితంగా చెప్పలేం .. అయితే వారి ప్లానింగ్ మాత్రం దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఎన్టీఆర్ నిల్ 2026 సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నారు .. ఇక ఫౌజీని కూడా వచ్చే ఏడాది సమ్మర్ కి టార్గెట్ పెట్టుకున్నారు. ఇవే కాకుండా రాబన్ హుడ్ రిలీజ్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలెన్స్ షూట్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ రిలీజ్ లాంటి బడ సినిమాలు మైత్రి నెత్తి మీద ఉన్నాయి .. పుష్పా2 ఇచ్చిన పాన్ ఇండియా హిట్ ఈ  బ్యానర్ కి నింపిన జోష్ అంతా ఇంతా కాదు. ఇక మరి పైన చెప్పిన రెండు సినిమాలతో మైత్రి వారు ఎలాంటి సంచనాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: