ప్రస్తుతం చాలామంది హీరో, హీరోయిన్లు పాన్ ఇండియా సినిమాల్లో చేసి  దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదం లేని సమయంలోనే  శ్రీదేవి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.. ఆమె 50 సంవత్సరాల వయసు దాటినా కానీ 25 సంవత్సరాల అమ్మాయిల కనిపించేది.. అలా తన అందాలను కాపాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనే అతిలోక సుందరి అందాల తారగా మారిందని చెప్పవచ్చు.. అలాంటి అందాల తార ఎంత పేరు తెచ్చుకుందో అంత అర్ధాంతరంగా మరణించింది.. అలాంటి ఈమె  సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించడం కాదు అందులో దూరిపోయి  జీవించేదట. అంతటి నటన టాలెంట్ కలిగినటువంటి శ్రీదేవిలో ఆ ఒక్క మైనస్ ఉందట.. దానివల్ల ఆమె ఎన్నో ఇబ్బందులు పడిందని ఒకానొక సమయంలో దర్శకులకు కూడా విసుగొచ్చేలా  చేసిందట.. మరి ఇంతకీ ఆమెకు ఎలాంటి సీన్స్ లో నటించడం రాలేదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శ్రీదేవి బాలనటిగానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ తో కూడా బాలనటిగా చేసి మళ్ళీ ఆయనకు హీరోయిన్ గా కూడా నటించింది. అలాంటి శ్రీదేవి పదహారేళ్ళ వయసు అనే చిత్రంలో మొదట భారతి రాజా డైరెక్షన్ లో చేసింది.. ఇందులో కమలహాసన్ హీరోగా చేయగా రజనీకాంత్  విలన్ పాత్రలో నటించారు.. అలాంటి శ్రీదేవి  ఈ సినిమా తర్వాత బాలచందర్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేసిందట.. అయితే ఈ సినిమా చేసే సమయంలో ఆమెకు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ అస్సలు ఇవ్వడం రాలేదట.. దర్శకుడు ఎన్ని సార్లు చెప్పినా ఆమెలో మార్పు రాకపోవడంతో  ఆయన షూటింగ్  మొత్తం ప్యాకప్ చెప్పేయండి అంటూ కోపానికి వచ్చారట.

ఆ తర్వాత కొంతమంది ఆమెను ఇంటికి తీసుకెళ్లి రొమాంటిక్ మూవీస్ అన్నీ చూపించారు. అయినా శ్రీదేవి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం  నేర్చుకోలేదట. దీంతో బాలచందరే దిగివచ్చి ఎక్స్ప్రెషన్ ఇవ్వకున్నా పరవాలేదమ్మా కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు అన్నారట.. ఇక అప్పటినుంచి ఆమె ఏ చిత్రంలో రొమాంటిక్ సీన్ ఉన్న కాస్త ఏడ్చినట్టు నటించేదాన్ని అంటూ శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. అప్పట్లో ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: