పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తన సినిమా విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు పొలిటికల్ పరంగా బిజీగా ఉండడం చేత పవన్ కళ్యాణ్ సినిమా డేట్ లకు కేటాయించిన డేట్లు షూటింగ్లో పాల్గొనలేక పోతున్నారు.. మరికొన్ని సినిమా షూటింగులు జరుగుతూ ఉన్నప్పటికీ ముందుకి సాగడం లేదట. గత కొంతకాలంగా సినిమా వాయిదా పడుతూ వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా మొదటిసారి ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రానికి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తూ ఉన్నారు.



అయితే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా ఇటీవలే మారినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా కావడం చేత ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే పాటలను పోస్టర్లను సైతం రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన రిలీజ్ కాబోతోందని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించారు. అయితే అదే రోజున నితిన్ శ్రీ లీల జంటగా నటించిన రాబిన్ హుడ్ సినిమా రాబోతూ ఉండడంతో హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ పోన్ అయిందనే విధంగా వార్తలు వినిపించాయి.



అయితే ఇప్పుడు అవన్నీ కూడా నిజం కాదని రూమర్సే అన్నట్లుగా నిర్మాత తెలియజేశారు.. చెప్పిన డేట్ కి హరిహర వీరమల్లు సినిమా అని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా పవన్ కి జోడిగా హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తూ ఉన్నది. మరి ఏ మేరకు ఈ చిత్రం పవన్ అభిమానులను మెప్పిస్తుందో తెలియాలి. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, అలాగే ఓజి సినిమా కూడా రిలీజ్ కావలసి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: