ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొద్ది రోజుల నుండి చిక్కుల్లో ఇరుక్కుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందా? అంతకంటే పెద్ద ప్రమాదంలో చిక్కున్నారు.. ఈయన సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి రావడంతో అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ని చూడ్డానికి పరిగెత్తుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించి ఆ మహిళ కొడుకు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ అబ్బాయికి ఇంకా చికిత్స అందుతుంది. అయితే ఈ తొక్కిసలాటలో జరిగిన ప్రమాదం కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది.ఆయన ఒకరోజు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలాగే బెయిల్ మీద బయటికి వచ్చాడు. అలా ఆయన పై ఉన్న కేసు ఇంకా కొట్టి వేయలేదు. అలాగే చాలామంది అల్లు అర్జున్ పై విమర్శలు కూడా చేశారు.ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది అల్లు అర్జున్ అలా చేసి ఉండకూడదు అని మాట్లాడారు.

అలాగే అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక తప్పు కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోలను కూడా రద్దు చేశారు. ఈ విషయంలో ఎంతోమంది బన్నీని తిట్టుకున్నారు. ఈయన చేసిన ఒక తప్పుకారణంగా ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతుంది అని మాట్లాడుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో పూజలు చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే చాలామంది అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఆయన జీవితం సాఫీగా సాగాలని ఏదైనా పూజలు చేశారు కావచ్చు అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..ఎందుకంటే అవి అల్లు అర్జున్ సినీ కెరియర్ గురించి మాత్రం అయితే కాదు.. తాజాగా ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రథసప్తమి చాలామంది చాలా ఘనంగా జరుపుకుంటారు.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ కుటుంబ లోని ఆయన భార్య కూతురు ఇద్దరూ రథసప్తమి వేడుకలను ఇంట్లో ఘనంగా జరిపారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తనకి సంబంధించిన ఎన్నో విషయాలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అలా ఇంట్లో రథసప్తమి వేడుకలు జరుపుకున్న ఫోటోలను కూడా కూతురితో కలిసి కూర్చున్న ఫోటోని షేర్ చేసింది.కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది నెటిజన్స్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి పండగలు జరుపుకుంటారా అని కామెంట్లు పెడుతున్నారు.అలాగే ఈ రథసప్తమి వేడుకల్లో ఇంట్లో పూజలు చేసేది అల్లు అర్జున్ కోసమేనని, అల్లు అర్జున్ అన్ని ఇబ్బందుల నుండి బయట పడాలని ఇంట్లో వాళ్ళు ఇలా పూజలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: