అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వారందరూ కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉన్నారు. అలా సీనియర్ నటి పుష్పలత కూడా చెన్నైలో ఇటీవలే కన్నుమూశారట. వృద్ధాప్య సమస్యల కారణంగా ఈమె నిన్నటి రోజున రాత్రి 9 గంటల సమయంలో మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె సొంత నివాసంలోనే మరణించినట్లుగా సమాచారం. పుష్పలత తన తొమ్మిదవ ఏటినే భరతనాట్యంలో శిక్షణ అందుకున్న ఎస్సే నటరాజు డైరెక్షన్లో వచ్చిన నల్ల తంగై అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారి ఎంట్రి ఇచ్చిందట పుష్పలత.



ఆ తర్వాత కొంగునాట్టు తంగం సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైందట. ఆ తర్వాత తమిళ్ ,తెలుగు, కన్నడ, మలయాళం తదితర భాషలలో కూడా 100కు పైగా సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది. ఈమె కెరియర్ లోనే ఎన్నో విజయవంతమైన చిత్రాలలో కూడా నటించింది పుష్పలత. ఈమె స్టార్ హీరోలు ఆయన ఎంజీఆర్, శివాజీ గణేషన్ తదితర నటులతో కలిసి నటించినట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చెరపకురా చెడేవు అనే సినిమాలో కూడా మొదటిసారి తెలుగుతరకు పరిచయమయ్యిందట.


ఆ తరువాత వేటగాడు, ఆటగాడు, ఆడబిడ్డ ,ఘరానా దొంగ, శూలం, ప్రతిజ్ఞ, రౌడీ, విక్రమ్ తదితర చిత్రాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదట. అలాగే కన్నడలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటించింది పుష్పలత. పుష్పలత కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా చేయడం జరిగిందట. 1964లో ఈమె వివాహం చేసుకున్నది.. తమిళంలో ఏబీఎన్ రాజన్ కు జోడిగా నటించిన ఈమె ఇతడిని వివాహం చేసుకున్నదట. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. అందులో ఒకరు మహాలక్ష్మి కూడా తెలుగు తమిళ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువు సినీ సెలబ్రిటీలు అభిమానులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: