డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన దేవర సినిమా మొదటి భాగం 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడ్డాయి. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో రకాల ట్రోలింగ్స్ వినిపించిన కూడా ఈ సినిమా మాత్రం బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ట్విస్టు పెద్దగా ఏమీ కనిపించలేదని బాహుబలి టైపులో ట్విస్ట్ ఉంటుందని వార్తలు వినిపించాయనే విధంగా ట్రోల్స్ చేశారు. అయితే దేవర చిత్రం పైన నెగిటివిటీ ఎంత వచ్చిందో అంతే మెల్లగా సినిమా నిలబడిందని చెప్పవచ్చు.


దీంతో దేవర 2 విషయం పైన చాలా చర్చలు కూడా కొనసాగాయి.. రెండవ భాగం ఎందుకని అందులో ఏముందో అంటూ చాలామంది మాట్లాడుకున్నారు. దేవర 2 సినిమా ఇక అట్టకెక్కింది అనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలే దేవర2 సినిమా స్క్రిప్ట్ ని కొరటాల శివ సిద్ధం చేస్తున్నారనే విధంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో దేవర 2 గురించి కొన్ని విషయాలను తెలియజేసింది నటి రామేశ్వరి.. వాటి గురించి ఒకసారి చూద్దాం.


నటి రామేశ్వరి దేవర చిత్రంలో రెండు మూడు సన్నివేశాలలో కనిపించింది. మొదటి భాగంలో కొంతమేరకే నటించానని రెండవ పాటల తన సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపింది షూటింగ్ మాత్రం ఇప్పట్లో ఉండదని కానీ తన పాత్ర నిడివికి కూడా కొంతమేరకు గౌరవం ఇచ్చారని తెలియజేస్తోంది. దేవర మొదటి భాగానికి మించి రెండవ భాగం ఉండబోతుందనే విధంగా తెలియజేసింది రామేశ్వరి.. ఈ సినిమా కథ విన్నప్పుడే తనకి బాగా నచ్చిందని అందుకే పాత్రను ఒప్పుకున్నారని కూడా తెలియజేసింది రామేశ్వరి.. మరి కొరటాల శివఏ మేరకు ఈ సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: