టాలీవుడ్ లో ఎన్నో డాటర్ లవ్ మూవీస్ వచ్చాయి.. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య వంటి స్టార్ హీరోలు డాటర్ సెంటిమెంట్ మూవీస్ లో అద్భుతంగా నటించి మెప్పించారు.. ఇటీవల అలా డాటర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ “ భగవంత్ కేసరి “.. బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది.. బాలయ్య రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా “ భగవంత్ కేసరిసినిమా తెరకెక్కింది..

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పాపకు అన్ని తానై ఉండి పాపని అందరి కంటే స్ట్రాంగ్ చేసి ఆర్మీకి పంపాలనే చీచా పాత్రలో బాలయ్య నటించారు.. ఈ సినిమాలో బిడ్డ కోసం దేనికైనా ఎదురెల్లే తండ్రి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడు..అలాగే శ్రీలీల సైతం తనకు దక్కిన పాత్రలో అద్భుతంగా నటించింది..ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నా కానీ ఆమె పాత్రకు అంతా స్కోప్ ఉండదు.. కొన్ని సన్నివేశాలు కుదిరినా కానీ అవి అంతగా మెప్పించవు.. ఈ సినిమా కథ అంతా శ్రీలీల చుట్టే తిరుగుతుంది.. గతంలో కూడా బాలయ్య తండ్రి పాత్రలో నటించినా ఈ తరహా పాత్రలో నటించడం ఇదే మొదటిసారి..

బాలయ్య లో ఉండే మాస్ యాంగిల్ నే కాకుండా కామెడీ యాంగిల్ ను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నాడు.. భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ లో మంచి విజయం సాధించింది..త్వరలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య మరో మూవీ చేయబోతున్నాడు.ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో “ అఖండ 2 : తాండవం “ లో నటిస్తున్నాడు..ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: