రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు కూడా ఒకటి..ఈ సినిమా లో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఇక రవితేజ కి జోడిగా జ్యోతిక,అనుష్కలు నటించారు. అయితే ఈ సినిమాలో రవితేజ ఒక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో పాత్రలో దొంగగా కనిపిస్తారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో విక్రమ్ రాథోడ్ గా రవితేజ తన నటనతో ఇరగదీశాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని రవితేజ నటనకి ఇప్పటికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. విక్రమ్ రాథోడ్ అంటూ రవితేజ మీసం మెలివేసే సన్నివేశాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే అలాంటి రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక రాజమౌళి డైరెక్షన్ అంటే ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పుకోవచ్చు. ఇక ఆ లెవల్ లోనే రాజమౌళి విక్రమార్కుడిని తెరకెక్కించారు. ఈ సినిమాలోని తారాగణం సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. 

అలాగే అనుష్కతో రవితేజకు వచ్చే సన్నివేశాలు బ్రహ్మానందం, రవితేజ మధ్య కామెడీ సీన్స్ రవితేజ స్వామీజీ పాత్రలో అరగుండు కొట్టడం వంటివి ఎన్నో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా ఇప్పటికి కూడా టీవీలలో వస్తే చాలామంది రవితేజ అభిమానులు ఇష్టంగా చూస్తారు. అయితే అలాంటి విక్రమార్కుడు సినిమాలో ఆకట్టుకునే అంశం తండ్రి కూతుర్ల ప్రేమ..ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించిన విక్రమ్ రాథోడ్ కూతురు పాత్రలో యాని నటించింది.అయితే ప్రస్తుతం యాని ని చూస్తే చాలామంది షాక్ అయిపోతారు విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా మారిపోయిందా అని..ఇక భార్యను పోగొట్టుకొని కూతురి కోసం బతుకుతాడు విక్రమ్ రాథోడ్.కానీ అనుకోని కారణాలవల్ల ఆయన చనిపోవాల్సి వస్తుంది.

 అయితే చనిపోయే సమయంలో ఆయన లాగే ఉన్న దొంగ పాత్రలో నటించిన అత్తిలి సత్తిబాబు ని చూస్తాడు.అలా తన కూతుర్ని తెలియకుండానే అత్తిలి సత్తిబాబు చెంతకు చేరుస్తాడు.కానీ తన తండ్రిని తెలియక యాని అత్తిలి సత్తిబాబుని నాన్న అని పిలుస్తుంది. ఆ తర్వాత పెళ్ళికాని అత్తిలి సత్తిబాబు ఇది నాకు తగులుకుంది ఏంటి అని పాపను వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అది కుదరదు పోలీస్ కు భయపడి మళ్లీ తన దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ పాప ఎవరు.. విక్రమ్ రాథోడ్ ఎలా మరణించాడు అనేది తెలుసుకొని అత్తిలి సత్తిబాబు కూతుర్ని కాపాడుకుంటూ శత్రువులను చంపేస్తాడు. అలా తండ్రి కూతుర్ల బంధాన్ని ఈ సినిమాలో చూపించారు.అలా విక్రమార్కుడు మూవీ 2006 జూన్ 23న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: