విషయం ఏంటంటే, రీసెంట్‌గా బాలయ్య బాబుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఈ వార్త వినగానే నందమూరి అభిమానులే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సినీ పరిశ్రమ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. బాలయ్య బాబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి చంద్రబాబు భార్య, బాలయ్య సోదరి అయిన నారా భువనేశ్వరి ఒక స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, బాలయ్య బాబు క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా టాప్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో చాలా మంది స్పీచ్‌లు ఇచ్చారు. అనిల్ రావిపూడి మైక్ అందుకుని మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు, పార్టీలో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ గురించి తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. ఆయన మాటలు వింటుంటే అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు.
నారా లోకేష్ గురించి మాట్లాడుతూ, "లోకేష్ బాబు వాళ్ల ఆవిడ ముందు వాళ్ల అమ్మగారి వంట గురించి పొగిడారు.. నిజంగా గట్స్ ఉండాలి బాబు గారు!" అంటూ నవ్వించారు. బాలయ్య బాబుని కూడా వదల్లేదు. "బాలయ్య బాబు వాళ్ల ఆవిడ వసుంధర ముందు, 'ఐ లవ్ యూ' ఎవరికి చెప్తారు అని అడిగారంట.. ఎంత డేరింగ్ క్వశ్చన్ అండీ!" అంటూ సెటైర్ వేశారు.
ఇంకా చంద్రబాబు గురించి కూడా ఫన్నీ కామెంట్ చేశారు అనిల్. "చంద్రబాబు నాయుడిని మనం ఎప్పుడూ చాలా గ్రాండ్‌గా చూస్తాం. కానీ భువనమ్మ రమ్మనేసరికి, ఒక సింపుల్ మనిషిలా స్టేజ్ మీదకి వచ్చారు. అంతేకాదు, స్పీచ్‌కు ఐదు నిమిషాలే టైమ్ లిమిట్ కూడా పెట్టారు. బాబీ, నేను మా ఆవిళ్లని తీసుకురాలేదని అప్పుడే అనుకున్నాం.. లేకపోతే మాకు కూడా ఇదే గతి పట్టేది." అని నవ్వించారు.
అనిల్ రావిపూడి ఈ కామెడీ పంచ్‌లకు చంద్రబాబు నాయుడు గారు కూడా పగలబడి నవ్వారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు అయితే తమ లీడర్‌ని అంత హ్యాపీగా చూసి తెగ సంబరపడుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలతోనే కాదు, మాటలతో కూడా నవ్వించగలరు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.