నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సౌర్యవ్ ఈ సినిమాను తండ్రి కూతురు మధ్య వచ్చే సెంటిమెంట్ కథాంశం ఆధారంగా రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎలాంటి కలక్షన్లను వసూలు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి హాయ్ నాన్న మూవీ కి నైజాం ఏరియాలో 12.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.68 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.58 కోట్లు , ఈస్ట్ లో 1.40 కోట్లు , వెస్ట్ లో 87 లక్షలు , గుంటూరులో 1.37 కోట్లు  , కృష్ణలో 1.35 కోట్లు , నెల్లూరులో 65 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.70 కోట్ల షేర్ ... 43.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని 5.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 9.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 38.60 కోట్ల షేర్ ... 74.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 28.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే వరకు 38.60 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి 10.10 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: