నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితం నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. నాని కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన దసరా మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ది పారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మూవీ కి అనిరుద్ సంగీతం అందించనున్నాడు అని అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుండి ఒక సూపర్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని రోజులే అవుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఓ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. 

మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిర సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సంస్థ వారు ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: