చిరంజీవి సినీ కెరీర్ లో హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాలలో డాడీ ఒకటి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు భూపతి రాజా కథ అందించగా సత్యానంద్ మాటలు రాశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించారు.
 
ఈ మూవీలో సిమ్రాన్ ఒక హీరోయిన్ గా నటించగా అషిమా భల్లా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో అక్షయ పాత్రలో అనుష్క మల్హోత్రా నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే చిరంజీవి కాకుండా వెంకటేశ్ నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ చిరంజీవికి అంతగా సూట్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
 
అయితే ఈ సినిమాలో డాటర్ సెంటిమెంట్ సీన్లు మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉంది. ఒక్కో సినిమాకు మెగాస్టార్ చిరంజీవి 60 నుంచి 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. చిరంజీవి విశ్వంభర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
 
సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. విశ్వంభర మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. విశ్వంభర సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో ప్రకటన రానుంది. మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ డైరెక్టర్ ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: