ప్రతి తండ్రి తన కూతురును ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అయితే ఆ ప్రేమను చూపించే విధానం భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2009 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన సినిమాలలో ఆకాశమంత ఒకటి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురు అభి పాత్రలో త్రిష నటించి మెప్పించారు. జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
 
ఈ సినిమాలో కూతురు పాత్రపై రఘురాం పాత్రలో ప్రకాష్ రాజ్ చూపించిన నటన న భూతో న భవిష్యతు అని చెప్పవచ్చు. ప్రతి సీన్ లో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో ప్రకాష్ రాజ్ సూపర్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు అందించగా మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలోని పాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
 
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, ఒకానొక ఊరిలో సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ప్రకాష్ రాజ్ త్రిషపై సినిమాలో ఏ విధంగా ప్రేమ చూపించారో ప్రతి తండ్రి తన కూతురిపై అదే విధంగా ప్రేమను చూపిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధా మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విద్యాసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
 
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆకాశమంత సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఎంతగానో ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ సినిమాకు అనువాదంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ప్రకాష్ రాజ్ కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా ఆకాశమంత మూవీ స్పెషల్ మూవీ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, త్రిష తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి.




 
 


మరింత సమాచారం తెలుసుకోండి: