తాజాగా "తండేల్" సినిమాతో హిట్టు అందుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు నాగచైతన్య . చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది . ఈ సినిమా మొత్తానికి కర్త - కర్మ - క్రియ సాయి పల్లవినే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు . సినీ ప్రమోషన్స్ లో కూడా బాగా పాల్గొంటుంది సాయి పల్లవి. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఊహించని కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాడు.
తండేల్ ప్రమోషన్స్ లొ పాల్గొన్న నాగచైతన్య ని.." మీరు అఖిలతో - అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరితో ఓకె చేస్తారు..?" అన్న ప్రశ్న అడగ్గా అఖిల్ తో ఆల్రెడీ మనం లో స్క్రీన్ షేర్ చేసుకున్నాను ..ఇక అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ మనసులోని మాటను బయటపెట్టారు . అయితే మనం సినిమాలో అఖిల్ పాత్ర చాలా చాలా చిన్నది. అసలు ఆయనది రోల్ అని చెప్పలేం . ఆయనతో స్క్రీన్ ఎక్కడ షేర్ చేసుకున్నాడు..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అఖిల్ - నాగచైతన్యకు అస్సలు పడదు అంటూ గతంలో వైరల్ అయినా వార్తలే నిజం అంటూ మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా సొంత తమ్ముడు అఖిల్ కన్నా కూడా అల్లు అర్జున్ ది బెస్ట్ అని పరోక్షంగా చెప్పేసి అఖిల్ పరువు తీసినట్లై అంటూ కావాలనే ఈ విషయంని హైలెట్ చేసేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య మాట్లాడిన మాటల తాలుకా వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!