హీరో రామ్ కెరియర్ , అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కెరియర్ లో నేను శైలజ సినిమా చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా వీరిద్దరికి మంచి లైఫ్ ఇచ్చింది 2016 లో విడుదలైన రొమాంటిక్ ,కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ,ఎమోషనల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇందులో లవ్ స్టోరీ లో చూపించిన విధానం అలాగే తండ్రి ,కూతుర్ల మధ్య చూపించిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.



సినిమా ద్వారా కీర్తి సురేష్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ధన్య బాలకృష్ణ, శ్రీముఖి, హిమజ తదితర నటీనటులు అద్భుతంగా నటించారు. అలాగే సత్యరాజ్ ,కీర్తి సురేష్ కి తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. కూతురు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన కానీ కూతురికి తన తండ్రి చేసిన కష్టం గురించి తెలియకపోతూ ఉంటుంది. అయితే చివరికి తన తండ్రి ప్రేమ గురించి తెలుసుకొని బాధపడుతుంది.. ఆ తర్వాత తండ్రి కోసం ఏం చేసింది అనే విషయమే సినిమా..


నేను శైలజ సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందట. 25 కోట్లకు పైగా లాభాలను అందించిందట. హీరో రామ్ రెడి తర్వాత అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హీరో రామ్ కెరియర్లు మళ్లీ ఊపిరి పోసేలా చేసింది.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయన్న అందుకున్న ఈ సినిమా 2016 టాలీవుడ్ కి శుభారంభాన్ని అందించింది. ఈ మధ్యకాలంలో కూడా హీరో రామ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి..RAPO 22 అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. చివరిగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించగా ఈ సినిమా ఫ్లాప్ ని మూట కట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: