ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నిర్మాతలకు అత్యాశ ఎక్కువవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడల్లేకుండా అన్ని సినిమాలకు టికెట్ రేట్లను పెంచుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో తండేల్ మూవీ పెరిగిన టికెట్ రేట్లతో విడుదల కానుందని గతంలోనే చెప్పుకున్నాం. అయితే ఈ టికెట్ రేట్ల పెంపు ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.
 
సినిమాకు 80 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని అందుకే టికెట్ రేట్లు పెంచుతున్నామని మేకర్స్ చెబుతున్నా ప్రతి సినిమాకు ఇలా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే సినిమాలను థియేటర్లలో చూడాలనే కోరిక చచ్చిపోతుందని కొందరు సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏపీ మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతులు ఇచ్చింది.
 
జీఎస్టీతో కలిపి ఈ పెంపును అమలు కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తండేల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలో తుఫాను సన్నివేశాల కోసమే ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని భోగట్టా. తండేల్ సినిమాకు టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
 
గత ప్రభుత్వం హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చైన సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపును అమలు చేసేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా తగ్గనుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాల్సి ఉంది. తండేల్ మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: