అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజా ‘తండేల్’ గురించి జనాలకు తెలిసిందే. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్రసార కార్యక్రమాలను షురూ చేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపైన ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసాయి. దాంతో మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్న తండేల్ పై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక తాజాగా డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో తండేల్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

అవును... తండేల్ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు కానీ మినిమమ్ గ్యారంటీ కలిగిన పట్టణాలు, థియేటర్ల లెక్కన ఎగ్జిబిటర్లకు అస్సలు ఇవ్వవద్దని నిర్మాతల మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేశారట. విషయం ఏమిటంటే... ఈ సినిమామీద ఉన్న నమ్మకమేనట. సినిమా బాగా ఆడుతుందని, అందువల్ల ఆదాయం లిమిట్ చేసుకోవద్దని నిర్మాతలు సూచించారట. దాంతో బన్నీ వాసు అల్లు అరవింద్ మాటలని తూచా పాటిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు... సంక్రాంతి సినిమాలు తర్వాత మరే ఇతర సినిమాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాని ఎగ్జిబిటర్లు, ఇపుడు తండేల్ సినిమాని కొనుగోలు చేసేందుకు క్యూలు కట్టారని వినికిడి. నాగ చైతన్య, పల్లవి క్రేజ్ జోడీ కావడం.. అచ్చ తెలుగు శ్రీకాకుళం రియల్ స్టోరీ కావడం, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే బిజినెస్ సర్కిల్స్ ఈ సినిమా గురించి ఆరాలు తీశాయట. ఈ క్రమంలో ఈ సినిమాని పెద్ద మొత్తంలో కొనడానికి ఎగబాకారట. కానీ వారి అంశాలమీద నీళ్లు చల్లారట అల్లు అరవింద్. ఎంతైనా పొట్టోడు గట్టోడు కదా. దాంతో అల్లు అరవింద్ నిర్ణయాన్ని దాటివెళ్లలేదట బన్నీ వాష్. కట్ చేస్తే... నిర్మాతల నిర్ణయంతో అన్ని ఏరియలలో రెంట్ బేసిస్ మీదా రిలీజ్ అవుతోంది తండేల్ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: