సీనియర్ హీరోయిన్ ప్రస్తుత నటి, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకుంది హీరోయిన్ ఖుష్బూ.. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్న ఈమె తాజాగా గాయాలైనట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఖుష్బూ ఎడమ చేతికి గాయాలైనట్లుగా కొన్ని ఫోటోలను చూపించారు. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.


హీరోయిన్ ఖుష్బూ తన ఎడమ చేతి కండరాలకు ఎలర్జీకి గురైందని అందుకే ఇలాంటి ఎనర్జీ తీవ్ర నొప్పిని సైతం ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రీడాకారులు తీవ్రమైన ఎక్సర్సైజులు చేయడం వల్ల ఇలాంటి కండరాల నొప్పి ఎలర్జీ అనేది వస్తుందట. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండే ఖుష్బూ తన కసరత్తులతో చాలా స్లిమ్ గా మారిపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఖుష్బూ ఇలాంటి నొప్పితో ఉన్నప్పటికీ షూటింగ్లో పాల్గొనిందట.


అలాగే మరొక పక్క వైద్యులు కూడా ఖుష్బూ చేతికి ఫిజియోథెరపీ అందిస్తున్నారట. తన చేతికి కట్టుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈమె ఫోటోలు చూసిన అభిమానులు కొంతమేరకు కంగారుపడుతున్న ఆమె ఆరోగ్యంగా ఉండాలని అభిమానులైతే కోరుకుంటూ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్ ఖుష్బూ కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగులో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన ఏ ఒక్క పాత్ర కూడా ఈమెకు సక్సెస్ అందుకోలేక పోయింది హీరోయిన్గా కూడా గతంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటించింది ఖుష్బూ. ఖుష్బూ భర్త కూడా డైరెక్టర్గా నటుడుగా మంచి పేరు సంపాదించారు ఎక్కువగా హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక ఈమె కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: