తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సూపర్ సక్సెస్ అయింది. నిఖిల్ మాలియకల్ విన్నర్ కూడా అయిపోయాడు. కానీ సీజన్ 9 రావాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది. సెప్టెంబర్ దాకా ఆగాలి. అంతవరకు బోర్ కొట్టకుండా ఉండేందుకు బిగ్ బాస్ టీమ్ ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది. అదే బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్ 2.

లాస్ట్ టైం నాన్‌స్టాప్ సీజన్ చాలా రచ్చ చేసింది 24 గంటలూ లైవ్, ఓటీటీలో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అందించింది. అప్పుడు నాగార్జున హోస్ట్, బిందు మాధవి విన్నర్. మళ్లీ అలాంటి మజానే ఈసారి కూడా చూడబోతున్నాం. నిజానికి లాస్ట్ ఇయర్ కూడా నాన్‌స్టాప్ సీజన్ 2 వస్తుందని అన్నారు. కానీ రాలేదు. ఈసారి మాత్రం పక్కాగా వస్తుందట. షో టీమ్ గట్టిగా ఫిక్స్ అయ్యారట. సీజన్ 8 అయిపోగానే స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అన్ని రెడీ కూడా చేశారు. కానీ అనుకోకుండా కొంచెం లేట్ అయింది. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో స్టార్ట్ కావాల్సింది.

ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సెట్ ఇంకా రెడీ అవ్వలేదు. సీజన్ 8 సెట్‌నే కొంచెం మార్చి నాన్‌స్టాప్‌కి వాడబోతున్నారు. ఆ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే లేట్ అయినా పర్లేదు, షో మాత్రం అదిరిపోతుంది అంటున్నారు.

మరో విషయం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 8 ఓటీటీలో దుమ్ములేపింది. చాలా మంది టీవీలో కంటే ఓటీటీలోనే ఫ్రీగా యాడ్స్ లేకుండా చూస్తున్నారు. అందుకే ఈసారి నాన్‌స్టాప్ సీజన్ 2 కి ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. హోస్ట్ నాగార్జునే, కంటెస్టెంట్స్ మాత్రం కొత్తవాళ్లే ఉంటారట. మొత్తానికి బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్ 2 కోసం అందరూ వెయిటింగ్. ఈ సీజన్ ఇప్పుడు ప్రారంభమైతే సమ్మర్ హాలిడేస్ లో చాలా కాలక్షేపం లభిస్తుంది. అంతేకాకుండా ఈ షో క్రేజ్ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: