ఈ బ్యూటీ తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో సినిమా కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాల తోనే హైలెట్ అవుతూ వస్తుంది .. అయితే త్రిష గతంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం అంటూ ఎన్నోసార్లు ఈమె పై పలు రూమర్లు బయటికి వచ్చాయి .. అయితే ఇప్పుడు గత కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఈమె పేరు మరోసారి గట్టిగా వినిపిస్తుంది .. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే త్రిష రాజకీయాల్లో కూడా అడుగుపెడుతుందని టాక్ కూడా వస్తుంది .. సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారుతారు అంటూ వస్తున్న ప్రచారాన్ని త్రిష తల్లి ఖండించింది.
అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది .. కోలీవుడ్ హీరోలలో హీరో శింబు షూటింగ్ సెట్లో తనను ఎప్పుడూ టీజ్ చేస్తారని .. అయితే విజయ్ మాత్రం ఒక గోడ పక్కన ఎవర్ని పట్టించుకోకుండా మౌనంగా కూర్చుంటాడని చెప్పుకొచ్చింది .. విజయ్ దళపతిలో తనకు నచ్చని విషయం ఇదేనని ఆయన ఆ విషయాన్ని మార్చుకోవాలని త్రిష చెప్పుకొచ్చింది .. అలాగే విజయ్ తనకు ఎప్పుడు ప్రప్రత్యేకమే అంటూ చెప్పుకొచ్చింది .. దీంతో ఇప్పుడు త్రిష చేసిన ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.