గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సినిమా వచ్చి నెల పూర్తి అయిన సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇంకా దేవర సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నారు. యశ్‌ రాజ్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ గతంలో చేసిన వార్‌ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ కోసం హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్‌ నటిస్తున్న కారణంగా సౌత్‌ ప్రేక్షకులు సైతం ఇప్పుడు వార్‌ 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ విపరీతమైన బజ్ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ కీలకమైన గెస్ట్‌ రోల్స్‌లో కనిపించబోతున్నారని గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక తాజాగా ఈ మూవీ స్టోరీ లీకైనట్లు తెలుస్తుంది. వార్ 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో వచ్చిన వార్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కించనున్నది.ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాటుగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో తెరకేక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే  ఈ సినిమా లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. ఎన్టీఆర్‌ను వార్ 2లో అయన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారు. అనే విషయాలు మీడియాలోనూ , ఎన్టీఆర్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాలోనే వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్న War2 కథ ఏమిటంటే.కబీర్ సింగ్ (హృతిక్ రోషన్) కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్‌ ఫోర్స్‌ లీడర్‌. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ (ఎన్టీఆర్) నుంచి భారీ ముప్పు ఏర్పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తాడు. మొదట్లో భారతదేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే స్థాయిలో ఏజెంట్ గా వీరేంద్ర నిలుస్తాడు. కానీ కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీమ్ లో భాగంగా శత్రు దేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వీరేంద్ర వెళ్ళినప్పుడు.. వీరేంద్రకు వెన్నుపోటు పొడిచి శత్రువులకు వదిలేసి కబీర్ వెళ్ళిపోతాడు.వాళ్ళ నుంచి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్న తనని అంతలా దొంగ దెబ్బ తీసారన్న కసితో టెర్రరిస్ట్‌గా మరి ముఖ్యంగా తనని వెన్నుపోటు పొడిచిన కబీర్ పై పగ పెంచేసుకుంటాడు. అలా వీరిద్దరి మధ్యా వార్ మొదలవుతుందని చెప్తున్నారు. అయితే చివరకు కబీర్ గురించి వీరేంద్రకు నిజం తెలుస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కథలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: