టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు .. ప్రస్తుతం ఈ హీరోకు బాక్సాఫీస్ దగ్గర ఓ సాలిడ్ హీట్ కావాలి .. చిన్న హీరోలు , స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే  రవితేజ మాత్రం సక్సెస్ కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది .. వాల్తేరు వీరయ్య హిట్ అయినప్పటికీ అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది .. ఇక గతంలో రవితేజ సినిమాలకు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే .. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలా థియేటర్ దగ్గర పండగ వాతావరణం ఉండేది .. ఇలా తన సిరి జీవితం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించాడు .. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ముందుకు వస్తున్నారు రవితేజ ..


 అదే విధంగా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  హరి శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించలేకపోయింది . ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే .. అయితే బాక్సాఫీస్ దగ్గర హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వ‌రుస‌ సినిమాలకు కమిట్ అవుతున్నాడు ఈ మాస్ హీరో.  ప్రస్తుతం తన కెరీర్లో 75వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .. అయితే ఈ మూవీ షూటింగ్లో ప్రమాదం జరగటంతో తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నాడు రవితేజ  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది ..


అయితే ఇప్పుడు రవితేజకు లవర్ గా , భార్య‌గా , వదినగా నటిచ్చిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఒకరు ఉన్నారు .. ఇంతకీ ఆమె ఎవరంటే .. మరి ఎవరో కాదు సౌత్ ఇండస్ట్రీలో భారీ రేంజ్ లో ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది .. అలాగే  టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది .. ఇంత‌కి ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ శృతిహాసన్ .. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు సినిమాలో రవితేజకు శృతి జంటగా నటించారు.. ఈ సినిమాలో శృతిహాసన్ , రవితేజకు లవర్ గా నటించింది .. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చారు .. ఇందులో రవితేజకు భార్యగా కనిపించింది .. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది .. ఇక ఇందులో చిరంజీవికి తమ్ముడుగా రవితేజ నటించారు .. ఇందులో చిరుకు జంటగా శృతిహాసన్ మెరిసింది .. ఇలా ఈ సినిమాలో రవితేజకు వదినగా శృతిహాసన్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: