మన ఇండియన్ చిత్ర పరిశ్రమ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు . అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ మరో లెవెల్ .. ఆ క్రేజ్ కు అనుగుణంగానే రజినీకాంత్ కూడా తన అభిమానులను కలిసే విధానంలో కూడా ఎంతో ప్రత్యేకంగా వ్యవహరిస్తారు .. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అభిమానులు కలవడానికి ఆయన ఇష్టపడరు .. కేవలం అభిమానుల కోసం ఆయన ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు . అప్పుడు చెన్నైలో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం జరుగుతుంది . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రజినీకాంత్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు .. తనను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల్ని తానే స్వయంగా కలుస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు.  


కేవలం అభిమానుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు .. తనపై మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్ ఆ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సంబంధిత అధికారులతో చర్చలు చేస్తాని అందుకు సమయం పడుతుందని .. కాబట్టి అభిమానులంతా ఓపిగ్గా ఉండాలని కూడా కోరారు. ఇలా ఎన్టీఆర్ కూడా రజినీకాంత్ రూట్ ను ఫాలో అవుతున్నాడు .. అదే విధంగా ఎన్టీఆర్ కూడా అభిమానుల మీట్లో పలు కీలక విషయాలను కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది ..


 గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అంటు న‌లుగుతున్న వివాదాలకు , ఈ మీట్లో పులిస్టాప్ పెట్టే అవకాశం కూడా ఉంది. అలాగే తన అభిమానులకు ఈ మీట్లో ఎన్టీఆర్ కీలక దిశా నిర్దేశం  చేసే అవకాశం కూడా ఉంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ మీట్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు ముందు రోజు లేదా ఆ రోజు నిర్వహిస్తారని కూడా అంటున్నారు. అభిమానుల మీట్‌తో ఎన్టీఆర్ అన్ని వివాదాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: