విషయంలోకి వెళ్తే... పూజా హెగ్డే ఇటీవల నటించిన దేవా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్త అటుఇటు అవుతోంది. షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం తొలుత ఓ మోస్తారు కలెక్షన్లు రాబట్టినా వారాంతం తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. కాగా ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... తాను ఏ సినిమాలో నటించామనే విషయం కూడా మరిచి, అమాయకంగా మీడియాకు, నెటిజన్లకు దొరికిపోయారు. పూజా హెగ్డే గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకొన్నాయి.
ఇక తాజాగా ముంబైలో ఓ మీడియా వేదికగా ఆమె మాట్లాడుతూ.. అల వైకుంఠపురం ఓ తమిళ సినిమా. అది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి కూడా హిందీలో బాగా రాణించింది. అలాగే డీజే చిత్రం కూడా హిందీలో బాగా ఆడింది. ఏ భాషలో రూపొందిందనే విషయం కాకుండా కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ ఉంటే ఆ సినిమా విజయం సాధిస్తుంది! అని ధీమాని వ్యక్తం చేసింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది. 'అల వైకుంఠపురంలో' సినిమాను ఆమె తమిళ మూవీగా చెప్పడం పట్ల నెటిజన్లు గొల్లుమంటున్నారు. ఆమె నటించిన సినిమా ఏ భాషలో వచ్చిందనే విషయం కూడా ఆమె మర్చిపోతే ఎలా? అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టాలీవుడ్ అంటే తమిళ సినిమా అనుకొంటుందేమో? త్రివిక్రమ్ ని కూడా తమిళ డైరెక్టర్ అనుకొంటుదేమో.. ఇంకా నయం అల్లు అర్జున్ ని తమిళ హీరో అనలేదు! అంటూ కాస్త కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.