మస్తాన్ సాయి ..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపులు రేపుతున్న పేరు రాజ్ తరుణ్- లావణ్యల కేసులో వెలుగులోకి వచ్చిన ఇతని   రీసెంట్ గానే పోలీసులు అరెస్ట్ చేశారు .. అయితే పోలీసుల విచారణలో మస్తాన్ సాయి గురించి ఎవరు ఊహించని నమ్మలేని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మస్తాన్ సాయి .. సైకో అంటే ఎలా ఉంటాడో .. మనిషనేవాడు ఎలా ఉండకూడదో .. చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్..! ఇప్పుడు మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెలుగు చూసాయి .. అతని గుట్టు మొత్తం బయట పడుతుందని అనుమానం వస్తే కాళ్ల బేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటాడని కూడా బెదిరిస్తున్నాడు .. అయితే తెరవన‌క మాత్రం తనకు అడ్డొచ్చిన వాళ్ళను చంపేందుకు భారీ ప్లానింగ్ లు స్కెచ్ లు కూడా వేస్తాడు .. ఇలా అతను పై ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్టులో బయటికి వచ్చాయి ..


జనవరి 30న మస్తాన్ సాయి , లావణ్య ఇంటికి వెళ్లి గొడవకు దిగకపోతే వీడింత కామాంధుడో ఎన్ని వందల అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో ఎంతటి దారుణమైన వ్యక్తో  బయటకు వచ్చేది కాదు .. అలాగే డ్రగ్స్ మత్తులో అక్కడ గొడవ చేయడం లావణ్య కంప్లైంట్ చేయడంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు .. ఇక ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసరికి 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్య కు డ్ర‌గ్స్‌ ఇచ్చి ప్రవేట్ వీడియోలు కూడా తీశాడు మస్తాన్ సాయి . తర్వాత ఈ విషయం లావణ్య కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి .. మస్తాన్ సాయి , లావణ్య మధ్య గతంలో రాజ్‌ తరుణ్ రాజీ కుదిరించాడు .. అలాగే మస్తాన్ దగ్గర ఉన్న లావణ్య వీడియోలను డిలీట్ చేయించాడు .. అయితే అవి డిలీట్ చేసే లోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి వాటిని బ్లాక్మెయిల్ కోసం దాచిపెట్టుకున్నాడు. ఇలాంటి ఎన్నో అరాచకాలు అతని రిమాండ్ రిపోర్టులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.


అలాగే హార్డ్ డిస్క్ కోసం లావణ్యను పలుమార్లు చంపాలని కూడా మస్తాన్ సాయి ప్రయత్నాలు చేశాడు .. ఇక జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్ళిన మస్తాన్ సాయి లావణ్య పై హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు.. ఇక దాంతో అతనిపై NDPS  సెక్షన్ ను కూడా పోలీసులు జోడించారు .. ఇక ఇప్పుడు ఈ కేసులో మస్తాన్ సాయి అతని స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్గా కూడా నిర్ధారణ వచ్చింది. ఇలా మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా అతను చేసిన దారుణాలు బయటికి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: