పాత్ర కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే వ్యక్తి.. విక్రమ్. ఐ, తంగలాన్ వంటి సినిమాల్లో రోల్స్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిన విషయమే. విక్రమ్‌కు తెలుగులో కూడా అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక విక్రమ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు ప్లాఫ్ అవ్వొచ్చు కానీ నటుడిగా మాత్రం విక్రమ్ ఫెయిల్ అవ్వడు. శివపుత్రుడు (తమిళ వెర్షన్ పితామగన్) సినిమాకు నేషనల్ అవార్డు  సైతం దక్కించుకున్నాడు. ఇక విక్రమ్ యాక్టింగ్ స్థాయిని తెలియజేసే మరో చిత్రం నాన్న. ఇందులో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా నటించి ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్. తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలోని సన్నివేశాలు మనసును మెలిపెడతాయి.  


ప్రతి తండ్రి తన కూతురును  ఎంతో ప్రేమగా చూసుకుంటారు ... అయితే ఆ ప్రేమను చూపించే విధానం ఎంతో భిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే .. అలాగే ఒక తండ్రి మానసికంగా   చిన్నపిల్లడి మనస్తత్వం అయితే ఆ తండ్రికి ఒక కూతురు ఉంటే అతను ఆ కూతుర్ని ఎలా చూసుకుంటాడు .. తన కూతురి భవిష్యత్తు కోసం ఆ తండ్రి తాపత్రం ఎలా ఉంటుంది .. ఇలా అన్నీ కలిపి 2011లో సౌత్ స్టార్  విక్ర‌మ్ హీరోగా వచ్చిన నాన్న సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో విక్రమ్ తో పాటు అతని కూతురు పాత్రలో నటించింది సారా అర్జున్ .. అలాగే  స్టార్ హీరోయిన్ అనుష్క కూడా కీలకపాత్రలో నటించింది.


ఈ సినిమాలో విక్రమ్ తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు .. అలాగే గతంలో తెలుగులో వచ్చిన మాతృదేవోభవ సినిమా మహిళల హృదయాన్ని గెలుచుకుంది .. నాన్న సినిమా తండ్రుల హృదయాన్ని గెలుచుకుంది .. ఎంతో నిదానంగా సాగే ఈ సినిమాని చూడాలంటే కాస్త వర్క్ కూడా ఓర్పు కావాలి .. రొటీన్ కథలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా తండ్రి ప్రేమకు ఎంతో అద్భుతంగా నిలుస్తుంది .. అలాగే మానివియా విలువలు సెంటిమెంట్లు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: