టాలీవుడ్ ఇండస్ట్రీ లో తండ్రి కి తగ్గ తనయుడిగా రాంచరణ్ ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. అలాగే rrr వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దేశం కానీ దేశాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.జపాన్ దేశం లో అయితే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. అంతే కాకుండా జపాన్ ప్రాంతం లో రామ్ చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టేలా చేసింది.కేవలం జపాన్ లో మాత్రమే కాదు, అమెరికన్ సిటిజెన్స్ లో కూడా రామ్ చరణ్ మామూలు క్రేజ్ ఏర్పడలేదు. అలాంటి రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలని ఏ ఇండియన్ డైరెక్టర్ కి ఉండదు చెప్పండి.అందుకే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ త్వరలోనే రామ్ చరణ్ మరియు షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ‘ధూమ్ 4’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అని బాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.ఇండియా లో ధూమ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ లో ఈ సిరీస్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి మూడు సినిమాలు వచ్చాయి.

మొదటి సినిమాలో జాన్ అబ్రహం దొంగ క్యారక్టర్ చెయ్యగా, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఇక రెండవ సినిమాలో మళ్ళీ అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్ర పోషించగా, హృతిక్ రోషన్ దొంగ పాత్ర చేసాడు.అయితే ముందు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని అభిషేక్ బచ్చన్ చేయగా, అతని అసిస్టెంట్ క్యారక్టర్ ని ఉదయ్ చోప్రా చేసాడు. కానీ ఈసారి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో వరుణ్ ధావన్, అలాగే ఉదయ్ చోప్రా క్యారక్టర్ లో కార్తీక్ ఆర్యన్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో తెలుగు నటీనటులకు స్కోప్ తక్కువే. ఇది ఫక్తు బాలీవుడ్ సినిమాగా తెరకెక్కబోతుందట.ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కూడా మొదలుపెట్టాడు సుకుమార్. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. మరి ధూమ్ 4 కి రామ్ చరణ్ డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: