మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఫాదర్ సెంటిమెంట్ ఉంటే... మరికొన్ని ప్రేమ కథ నేపథ్యంలో వస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని డాటర్ సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ కూడా అయ్యాయి. అలాంటి సినిమాలలో చందమామ ఒకటి. అప్పట్లో ఈ సినిమా ప్రభంజనమే సృష్టించిందని చెప్పవచ్చు. 2007 సంవత్సరంలో రిలీజ్ అయిన చందమామ సినిమా.... పూర్తిగా కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చింది.

 

ఈ సినిమాను కృష్ణవంశీ చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో శివ బాలాజీ, కాజల్, నవదీప్, మరియు సింధు మీనన్ లాంటి నటీనటులు కీలకపాత్రలో కనిపించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో నాగబాబు.. జీవించేశారు. 2007 సెప్టెంబర్ ఆరో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... మంచి కలెక్షన్ ను రాబట్టింది. కూతురు సెంటిమెంట్ లో వచ్చిన ఈ సినిమాను.. జనాలు బాగానే ఆదరించారు.

 

కాజల్ తండ్రిగా నాగబాబు అద్భుతంగా నటించారు. అలాగే... సింధు మీనన్  కు పెదనాన్నగా కనిపించారు నాగబాబు. అయితే ఈ సినిమాలో తన ఇద్దరు కూతుళ్లు.. ప్రేమలో పడతారు. నవదీప్ అలాగే... శివ బాలాజీ లను ఓ ప్రేమిస్తారు. ఈ విషయం తెలియకుండా... నాగబాబు వేరే పెళ్లి చేయాలని అనుకుంటారు. దీంతో సెంటిమెంట్ సీన్లు అక్కడ బాగా పండిపోతాయి.

 

చివరికి ప్రేమించిన వాడి కోసం... హీరోయిన్ కాజల్ అలాగే సింధు మీనన్... తండ్రిని కాదని బయటికి వెళ్దామని డిసైడ్ అవుతారు. కానీ నాగబాబు మాత్రం... అందరి తండ్రిలాగా కాకుండా ... కూతుళ్ళ ఇష్టమే తన ఇష్టమని... ఇద్దరు హీరోలతో పెళ్లి జరిపిస్తారు. అలా ఈ సినిమా కూతురు సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ అందుకుంది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే జనాలు కచ్చితంగా చూస్తారు. కాగా ఈ సినిమా చేసిన తర్వాత హీరోయిన్ కాజల్కు మంచి అవకాశాలే టాలీవుడ్ ఇండస్ట్రీలో రావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: