టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకోగా, మరికొన్ని సినిమాలు విఫలమవుతున్నాయి. ఎక్కువగా లవ్ స్టోరీ, సెంటిమెంట్, క్రైమ్, థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక మరి కొంతమంది సెంటిమెంట్ సినిమాలు అంటే ఎగబడి చూస్తారు. అలాంటి సినిమాల లో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమా 10 అక్టోబర్ 2002లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా నటించారు. 

ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సునీల్, సుధా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనిత చౌదరి, తని కెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, ఎంఎస్ నారాయణ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శ కత్వం వహించాడు. స్రవంతి రవి కిషోర్ నిర్మాతగా వ్యవహరించారు. నువ్వే నువ్వే సినిమాకు 2002లో ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డును వరించింది. కా


గా, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా శ్రీయ, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. తండ్రి, కూతుర్ల మధ్య ఉండే బాండింగ్ ను ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా చూపించారు.  తన కూతురు శ్రియ, హీరో తరుణ్ ను ఇష్టపడుతుందని తెలిసి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేస్తాడు.


కానీ చివరి ప్రకాష్ రాజ్ తన కూతురు ఇష్టం మేరకు పెళ్లి క్యాన్సిల్ చేసి తరుణ్ తో వివాహానికి ఒప్పుకుంటాడు. కాగా ఈ సినిమా అప్పటి కాలంలోనే కోట్లలో కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో శ్రియ మంచి గుర్తింపును దక్కించుకొని వరుసగా సినిమాలలో నటించింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: