ఇటీవలే ఒక ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అలా వైకుంఠపురం సినిమా తమిళ సినిమా అంటూ తెలియజేసింది. ఈ విషయం విన్న వెంటనే అల్లు అభిమానులు కూడా పూజా హెగ్డే ను ఏకీపారేస్తూ లైఫ్ ఇచ్చిన హీరోని సినీ పరిశ్రమని మర్చిపోతున్నావా పూజా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే అలా వైకుంఠపురం సినిమా పాన్ ఇండియా సినిమా కాదు కానీ ప్రజలు మాత్రం హిందీలో కూడా ఈ చిత్రాన్ని చూస్తున్నారో అంటూ తెలియజేసిందట. పూజ హెగ్డే చేసిన ఈ వాక్యాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కంటెంట్ బాగుంది పనితనం ఉంటే ప్రజలే సినిమాని సక్సెస్ చేస్తారని చెప్పడం వరకు బాగానే ఉన్నా కానీ తెలుగు సినిమాని తమిళ సినిమా అని చెప్పడంతో ఒక్కసారిగా ఈమె పరిస్థితి టాలీవుడ్ లో మారిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తో డీజే ,అలా వైకుంఠపురం వంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ఇండస్ట్రీకి ఇలాంటి అవమానాలు చేస్తారా అంటూ అభిమానులు ఫైర్ కావడమే కాకుండా.. ఇలాంటి హీరోయిన్స్ కు తెలుగు దర్శకులు, నిర్మాతలు ఎందుకు అవకాశాలు ఇస్తారు అంటూ ఫైర్ అవుతూ ఉన్నారు. మరి ఒకవేళ పూజ హెగ్డే పొరపాటున మాట్లాడిందా లేదా అనే విషయం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.