టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో ఈ బ్యూటీ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తమన్నా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. 

అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో తనదైన నటన, అందంతో తన సత్తాను చాటుకుంటుంది. తమన్నా సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తారు. కాగా, ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు వివాహం చేసుకోలేదు. తన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ తమన్న ఇంతవరకు వివాహం చేసుకోకపోవడం గమనార్హం. కాగా, గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.


చాలా కాలం నుంచి వీరిద్దరూ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు, డేటింగ్ లో ఉన్నట్లుగా తమన్నానే బహిరంగంగా వెల్లడించింది. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. తమన్నా, విజయ్ వర్మ వివాహం ఇప్పుడు, అప్పుడు అంటూ ఎన్నో రకాల వార్తల వచ్చినప్పటికీ తమన్నా ఇంతవరకు వివాహం చేసుకోలేదు. మరి వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించి ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

తమన్నా, విజయవర్మ వారి రిలేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లారట. అక్కడ ఏదో చిన్న విషయంలో తమన్నా, విజయ్ వర్మ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుందట. ఆ సమయంలో తమన్నపై విజయ వర్మ చేయి చేసుకున్నారట. ఆ తర్వాత మళ్లీ తమన్నాకు విజయవర్మ క్షమాపణలు చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేశారట. ఈ వార్త తమన్నా సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: