విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదనే వార్త బయటకు పొక్కింది. దాంతో ఇదేం ట్విస్ట్ అని ఘట్టమనేని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ అయ్యిన నాటినుండి అప్డేట్స్ గురించి గ్లోబల్ లెవల్‌లో జనాలు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పక పోవడం కొసమెరుపు. ఈ క్రమంలోనే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు రానివ్వడం లేదు.
అయితే ప్రస్తుత సమాచారం మేరకు.. అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదట. ఈ సినిమాలో లేడీ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి అయ్యిందని సమాచారం. ఈ కొత్త లీకేజ్ అప్‌డేట్‌తో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపైన మరోసారి చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు మూవీ టీమ్ పరిశీలిస్తుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం సంప్రదింపులు జరిపినట్టు కూడా సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించి సెట్స్ నుంచి ఎలాంటి వార్త లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు మూవీ మేకర్స్.