టాలీవుడ్ రూమర్ కపుల్ నేషనల్ క్రష్ రష్మిక, లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ చాలా కాలం నుంచి వీరిద్దరి ప్రేమ విషయాన్ని అసలు బయట పెట్టడం లేదు. చాలా సందర్భాలలో వీరికి సంబంధించిన ఒకే రకమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవ్వడం చూసాం. ఈ వార్తలపై వారిద్దరినీ చాలా సందర్భాలలో ప్రశ్నించినప్పటికీ ప్రేమ విషయాన్ని దాటుతూ వచ్చారు. అయితే తాజాగా రష్మిక వీరి ప్రేమ విషయాన్ని బహిరంగంగా ఒప్పేసుకుంది. 

విజయ్ దేవరకొండతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు, ప్రేమలో ఉన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పేసింది. కాగా, గత కొద్ది రోజుల క్రితం రష్మిక కాలుకి ట్రాక్టర్ ఫ్రాక్చర్ అయింది. దీంతో రష్మిక నడవలేని స్థితిలో ఉన్నారు. కేవలం వాకర్ సహాయంతో నడుస్తున్నారు. ప్రస్తుతం రష్మిక రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 


వీరిద్దరూ మరోసారి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ కలిసి జిమ్ కి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కెమెరా కంటపడ్డారు. అయితే రష్మిక నడవలేని స్థితిలో ఉంది. వాకర్ సహాయంతో బయటకు వచ్చింది. కారు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. కానీ విజయ్ రష్మిక కన్నా ముందే కారు ఎక్కి కూర్చున్నాడు. కనీసం రష్మికకు కారు ఎక్కడానికి విజయ్ సాయం చేయలేదు. 

దీంతో రష్మిక అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. రష్మికను ఇలా వదిలేయడం ఏంటి అని అంటున్నారు. నడవలేని స్థితిలో ఉన్న రష్మికకు సహాయం చేయొచ్చు కదా అని అంటున్నారు. కనీసం కారు ఎక్కే సమయంలో హెల్ప్ చేయవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు. ఇంత ఆటిట్యూడ్ అవసరమా నీకు అంటూ నెగిటివ్ గా విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: